స్వస్తిశ్రీ నందన నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి 01-11-1952 రోజున కీ॥శే॥ నర్సయ్య, బాలమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో వెంకటయ్య గా జన్మించడం జరిగింది. తన ఏడవ ఏట ఒక రోజు గ్రామంలో ఆంజనేయస్వామి వారికి చందన పూజ చేసుకొని కూర్చొని ఉండగా తన చుట్టూ అమాంతంగా పుట్టలా మెడవరకు ఏర్పడింది. అప్పుడు అక్కడే వున్న వేదపండితులు శ్రీ రామసేవాతత్పరులు అయిన కీ॥శే॥ గౌడిచర్ల రాంకిషన్ రావు, సీతారాంపూర్ వాస్తవ్యులు ఆయనలో లీనమై వున్న అద్బుతమైన దైవికశక్తిని గుర్తించి తండ్రికి చెప్పడం జరిగింది. వీరిని ఇక్కడ వుంచకుండా ఇంకా ఎక్కడైన వుంచమని చెప్పగా పండితులఆజ్ఞ మేరకు నర్సయ్య తన కుమారున్ని వారి అమ్మమ్మ గారింటికి పంపడం జరిగింది. అక్కడ కూడా అతను నిరంతరం దైవధ్యానం చేసుకుంటూ దొరవారి ఇంట్లో పశువులను మేపేవారు. ఆ తర్వాత తన 11వ ఏట తెలిసిన వారి సహకారంతో ఉత్తరప్రదేశ్‌లో వున్న శ్రీశ్రీశ్రీ రామానంద యోగి గారి దగ్గరకు వెళ్లడం, అక్కడ సకలయోగవిద్యలు అభ్యసించెను. ఆ తరువాత రామానందయోగి గారే ‘వెంకటయ్య’ పేరును ‘శ్రీ వెంకట స్వామి’ గా నామకరణం చేసెను. ఆ తరువాత స్వామి వారికి ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామంనకు వచ్చి తన 18వ ఏట వివాహం జరిగింది. స్వామి వారికి రాజయోగ ధర్మము ప్రకారం ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగెను. ఆ తరువాత స్వామీజీ ఎన్మో అద్భుతమైన, నభూతోనభవిష్యత్ లాంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.